హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల వసతి సౌకర్యాల మెరుగుదలకు కీలక ముందడుగు పడింది. కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం లభించగా, పనుల నిర్వహణకు అధికారిక ఎంట్రస్ట్మెంట్ ఆర్డర్లు జారీ అయ్యాయి. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ హాస్టళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి హాస్టల్ నిర్మాణానికి రూ.7.28 కోట్ల చొప్పున మొత్తం రూ.14.56 కోట్ల అంచనా వ్యయంతో బాలుర, బాలికల హాస్టళ్లను నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ)కు అప్పగించారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 132/1లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో హాస్టళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రణాళిక రూపకల్పన, డిజైనింగ్, ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహణ, నిర్మాణ పర్యవేక్షణతో పాటు పనులను వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను విశ్వవిద్యాలయం ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుంది. హాస్టళ్ల నిర్మాణ పనులను 2027 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులకు సూచించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుందని భావిస్తున్నారు. హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.