ఒడిశాలో జూలపల్లి ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శన
విశ్వంభర, కమాన్ పూర్ : ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ లో నిర్వహించిన "శీతల్ షష్ఠి" మహోత్సవాలలో కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామ "ఒగ్గు డోలు" కళాకారుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. డోలు వాయిద్యంతో పాటు వివిధ రకాల విన్యాసాలు, నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవ ప్రదర్శనలో ఒగ్గు డోలు కళాకారులు ఎలబోయిన కుమార్ యాదవ్, ఎలబోయిన మహేష్ చంద్ర యాదవ్, ఎలాబోయిన ప్రనుష్ యాదవ్, ఎలాబోయిన మనోహర్ యాదవ్ లతో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు.