మహిళలు, చిన్నారుల రక్షణ కు కఠిన చర్యలు అవసరం
విశ్వంభర, నల్లకుంట : మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని నాయి బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు చేర్యాల ఉమారాణి పేర్కొన్నారు. హైదరాబాదు నల్లకుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులపై దాడులు, వేధింపులకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. బాధితులకు తక్షణ సహాయం, రక్షణ కల్పించడంతో పాటు కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం పై డిమాండ్ చేశారు.