ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్ భవాని , ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా పట్ల తమ ఆసక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి భవాని మాట్లాడుతూ, యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమాన్ని వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీమతి జహారా సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థినులకు వివిధ యోగా ఆసనాలను చేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పి జి సి ఆర్కు చెందిన మంజుల , సిఆర్టి హిమబిందు , ఉపాధ్యాయ బృందం మరియు ఇతర సిబ్బంది పాల్గొని విద్యార్థినులను ప్రోత్సహించారు. విద్యార్థుల ఉత్సాహం, క్రమశిక్షణతో నిర్వహించిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రత్యేక అధికారి భవాని,వ్యాయామ ఉపాధ్యాయురాలు జహారా, మరియు ఉపాధ్యాయ బృందాన్ని పలువురు అభినందించారు.