దక్షిణ మధ్య రైల్వేలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్, యోగా గురువు మురారి మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సిద్ధార్థ్ కటి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, విద్యార్థులు, యోగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జోన్ వ్యాప్తంగా సిబ్బంది వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం కూడా నిర్వహించారు. ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్ "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా"గా నిర్వహించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి సంపూర్ణ శ్రేయస్సు సాధ్యమవుతుందని యోగా గురువు మురారి మోహన్ తెలిపారు. అనంతరం ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ మాట్లాడుతూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన యోగా గురువు మురారి మోహన్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమానికి ముందు కోల్‌కతాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు, సిబ్బంది వీక్షించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని యోగా ప్రాధాన్యతపై ప్రసంగించారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/international-yoga-day-celebrated-on-south-central-railway/article-16909

Tags: