శ్రీ రామాలయం వంటశాలకు భూమిపూజ
- కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో ఉన్న శ్రీ రామాలయంలో వంటశాల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్, స్థానిక 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, చైర్‌పర్సన్, ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ శ్రీ రామాలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వంటశాల నిర్మాణంతో పాటు భవిష్యత్తులో ఆలయానికి ఆదాయ వనరులు పెంచేలా షట్టర్లు, వాష్‌రూమ్‌ల నిర్మాణానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రామాలయ అభివృద్ధికి మానుకోట ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేశపల్లి నవీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ లోయ, ఓం నారాయణ లోయ, ఎస్‌వీ నాగేశ్వరరావు, శ్రీరంగం వెంకట్రామ నరసయ్య, నాల్ల నరసింహారావు, గిరిధర్, గుప్తా పెరుగు కుమార్, ఎడ్ల రమేష్, చిదిరాల జ్ఞానేశ్వర్, నీరుటి లక్ష్మీనారాయణ, శ్యామ్, వేమిశెట్టి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్, చైర్‌పర్సన్ జ్యోతి రమేష్, ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డిలను ఘనంగా సన్మానించారు.