తాళం పగల కొట్టి ఆభరణాలు చోరీ

తాళం పగల కొట్టి ఆభరణాలు చోరీ

విశ్వంభర, నెల్లికుదురు: తలుపుల తాళం పగలగొట్టి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా జిపి పరిధిలోని భూక్యధాన్య తండాలో లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత తండాకు చెందిన భూక్య దివ్య, భర్త వినోద్ కుమార్ తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని ఇంటికి తాళం వేసి శనివారం సాయంత్రం మరిపెడలోని ధారావత్ తండాకు వెళ్ళింది. అదే రాత్రి దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువా తాళం పగలగొట్టి మూడున్నర తులాల బంగారు వస్తువులు,పుస్తెలతాడు,రెండు జతలు చెవి రింగులు అపహరించారు. ఈ మేరకు బాధిత భూక్య దివ్య చేసిన ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/broke-the-lock-and-stole-the-jewels/article-16873

Tags: