వీరభద్రీయ వీరముష్టీ సంఘ సభ్యులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని పిలుపు
విశ్వంభర, జీహెచ్‌ఎంసీ : తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నం.16 ప్రకారం అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) జాబితాలో వీరభద్రీయ వీరముష్టీ సమాజానికి ప్రాధాన్యత కల్పించడం పట్ల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా విద్య, ఉపాధి, స్వయం ఉపాధి తదితర సంక్షేమ పథకాలలో సమాజ సభ్యులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నివసిస్తున్న వీరభద్రీయ వీరముష్టీ సంఘ సభ్యులు ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, ఆన్‌లైన్ రసీదు ప్రతితో పాటు మండల, జిల్లా కుల సంఘాల సిఫార్సు లేఖలను సంబంధిత జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఎంబీసీ వర్గాలకు జి.ఓ. 16 ప్రకారం ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో సంఘ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని వాటి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సంఘ నాయకులు కోరారు.