విద్యార్థి జీవితం అమూల్యం.. నైపుణ్యాల పెంపే అవసరం
విశ్వంభర, కాచిగూడ : విద్యార్థి జీవితం అమూల్యమైంది, పోటీ ప్రపంచంలో నిలవాలంటే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బావ సార్ క్షత్రియ సమాజ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జేతేనే , భావసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి అశ్విన్ పటంగే అన్నారు. భావసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదు కాచిగూడ బావ సార్ పవన్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 250 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు ఆర్కే బాబు, ఎ.సురేశ్ గౌడ్, అంబటి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంలో పోటీ తత్వం పెరిగిందని, విద్యార్థులు చదువుల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా విజయాలను సాధించగలరని పేర్కొన్నారు. కష్టపడి చదివే విద్యార్థులే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో: శ్రీధర్ కండే, మధుగరలే, రవీందర్, సత్యనారాయణ, రాజశేఖరరావు పాల్గొన్నారు.