పేద విద్యార్థిని చదువుకు కానా సంస్థ అండ

పేద విద్యార్థిని చదువుకు కానా సంస్థ అండ

విశ్వంభర, జగిత్యాల : ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న జగిత్యాల విద్యార్థిని  ఎల్బీనగర్లోని సల్లూరి ప్రియమణికి కానా సంస్థ సహాయం అందించింది. పదవ తరగతిలో 600కు 570 మార్కులు సాధించిన ప్రియమణి, ఇంటర్ చదువుకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుడు దత్తు (డీఆర్‌పి, కౌన్సిలర్), బోటనీ లెక్చరర్ వీరబాబు కానా సంస్థ ప్రతినిధి నాతి గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కానా సంస్థ, స్థానికంగా నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు ద్వారా రూ.80 వేల ఫీజు చెల్లించింది. ప్రియమణి తన చదువులో మంచి ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలుస్తానని తెలిపింది. ఆల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్ కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి క్రిష్ణ, ఇతరులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-organization-to-educate-a-poor-student/article-16905

Tags: