సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

  •  సిబ్బందితో కలిసి యోగా చేసిన ఎస్పీ కె.నర్సింహా 

విశ్వంభర, సూర్యాపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఆదివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నర్సింహా స్వయంగా పాల్గొని, పోలీస్ సిబ్బందితో కలిసి వివిధ రకాల ఆసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి యోగా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, వృత్తిపరమైన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన శక్తి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహ చారి, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, ఆర్ఐలు ప్రవీణ్, జానయ్య, ఎస్ఐ లు, ఆర్ఏస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/international-yoga-day-was-celebrated-at-suryapet-district-police-office/article-16847

Tags: