అఖిలపక్ష పోరాటంతో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన రద్దు

  • ప్రజల విజయం అని అఖిలపక్ష నాయకుల హర్షం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు రద్దు కావడం అఖిలపక్ష పోరాటానికి దక్కిన విజయమని నాయకులు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా కాలుష్యకారక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ప్రజలు ఉద్యమం చేపట్టారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఫ్యాక్టరీ ఏర్పాటును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ "అంబుజా గో బ్యాక్" నినాదాలతో నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని తెలిపారు. దీనికి బదులుగా డ్రై పోర్ట్, లాజిస్టిక్స్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ మాట్లాడుతూ, ప్రజల ఐక్యతతో సాగిన పోరాటం ఫలితంగానే సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతిపాదన రద్దు అయిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-cement-factory-proposal-was-canceled-with-an-all-party-struggle/article-16911

Tags: