రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లింగ్ పరిశ్రమ వ్యవసాయ రంగానికి వెన్నెముకలాంటిదని పేర్కొన్నారు. రైతులు, మిల్లర్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు సొంత భవనం నిర్మాణం కావడం సభ్యుల ఐక్యతకు నిదర్శనమని అభినందించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి పాల్గొని అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు లారి రవీందర్, ప్రధాన కార్యదర్శి రాముని రామనాథం, కోశాధికారి నరేష్ కుమార్ గోయల్, నూతన భవన నిర్మాణ కమిటీ చైర్మన్ పూరే లక్ష్మణ్, వైస్ చైర్మన్ మిట్టపల్లి అంజయ్య తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైస్ మిల్లుల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొత్త భవనం నిర్మాణం ద్వారా అసోసియేషన్ కార్యకలాపాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.