తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక జయశంకర్ సార్
- చేవెళ్లలో విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
విశ్వంభర, చేవెళ్ల : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ ప్రేరణదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలో ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ జీవితాంతం అలుపెరగని పోరాటం చేశారని, ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, స్వాభిమాన సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మాజీ జిల్లా కార్యదర్శి అశోక్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పత్తి సత్యనారాయణ, చేగురి ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు పిసరి శ్రీకాంత్ రెడ్డి, బీజేవైఎం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గణేష్, రామకృష్ణ, బీజేపీ నాయకులు పాగా వెంకటేష్, కమిటీ సభ్యులు ఆనంద్ చారి, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.