త్రివేణి పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

 విశ్వంభర,  భద్రాచలం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని త్రివేణి పాఠశాలలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. "ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగా" అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్ట్‌ఫుల్‌నెస్ అండ్ ధ్యాన సంస్థ భద్రాచలం డివిజన్ మండల సమన్వయకర్త సీతకుమారి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే సంపూర్ణ జీవన విధానమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి తాడాసనం, త్రికోణాసనం, భుజంగాసనం, వజ్రాసనం, వృక్షాసనం తదితర యోగాసనాలు చేయించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిరుపమ మాట్లాడుతూ, యోగా విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ విమలాదేవి, అకాడమిక్ ఇన్‌చార్జ్ నరేష్, క్యాంపస్ ఇన్‌చార్జ్ సందీప్ రెడ్డి యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, ప్రతిరోజూ యోగా అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణతో యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం ధ్యాన కార్యక్రమం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమం ముగిసింది.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/international-yoga-day-celebrated-at-triveni-school/article-16926

Tags: