బోగారంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. నేటి ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్నతనం నుంచే యోగా సాధన చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి సర్పంచ్ స్వయంగా పలు యోగాసనాలు వేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ విద్యార్థులకు వివిధ ఆసనాల ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముస్కు వెంకట్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నేరటి మౌనిక సురేష్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన పబ్బు జ్యోతి, గ్రామ పెద్దలు అంతటి మల్లేశం, నేరటి రమేష్, కే.రాజు గౌడ్, బద్దుల నరసింహ, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.