మహిళల రక్షణే ‘షీ టీమ్స్’ ధ్యేయం
విశ్వంభర, సిద్దిపేట: మహిళలు, విద్యార్థినులు, బాలికల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'షీ టీమ్స్' నిరంతరం పనిచేస్తున్నాయని సిద్దిపేట ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐ ఏబీ దుర్గ చెప్పారు. జిల్లా కేంద్రంలోని దేశాయ్ బీడీ కంపెనీలోని మహిళా కార్మికులకు, సిబ్బందికి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా దుర్గ హాజరై మహిళలకు చట్టాలు, వారి హక్కులపై అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సుదీర్ఘంగా వివరించారు. ఈవ్ టీజింగ్, పని ప్రదేశం, సోషల్ మీడియా వేధింపులపై మహిళలు అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలిపారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని, వీటిని అరికట్టడంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలకు 'గుడ్-బ్యాడ్ టచ్'లపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లీయింగ్ (ఆన్‌లైన్ వేధింపులు) పట్ల మహిళలు, యువతులు మోసపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. మహిళలు ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అధైర్య పడకుండా తక్షణమే అత్యవసర సాయం కోసం డయల్100, సిద్దిపేట షీటీమ్ నంబర్ 8712667434కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.