ఎమ్మెల్యే నాగరాజును విమర్శించే హక్కు టిఆర్ఎస్ నాయకులకు లేదు

  • : వీసం సురేందర్ రెడ్డి

విశ్వంభర, హనుమకొండ: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని విమర్శించే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు లేదని  హాసన్ పర్తి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు నియోజకవర్గ అభివృద్ధి కొరకు, రైతుల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని కావాలని బిఅరెస్ నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం జరుగుతుందని విమర్శించారు.  ఎమ్మెల్యే నాగరాజు రైతు సంక్షేమం కొరకు కృషి చేస్తూ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మూడు రోజుల కింద హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్ ల మార్కెటింగ్ అధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గన్ని బ్యాగుల  కొరత కొరకు ఎమ్మెల్యే  వెంటనే స్పందించి రెండు లక్షల రూపాయలు సొంతంగా అందించడం జరిగిందన్నారు. వారం రోజుల క్రితం ఇల్లందు వరంగల్ వ్యవసాయ మార్కెట్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతుల సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని గుర్తు చేశారు. పేద ప్రజల సమస్యలు తీర్చడానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డయల్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా, రైతులు పండించిన పంటలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వార కొనుగోలు చేస్తూ  రైతులకు బోనస్ ఇవ్వడం జరిగిందని వ్యవసాయ యాంత్రికరణ పనిముట్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోలేపల్లి బుచ్చిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు రామాంచ ఐలయ్య, కందుకూరి పున్నం చందర్, గరిగ రాజు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/trs-leaders-have-no-right-to-criticize-mla-nagaraju/article-15114

Tags: