పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు
విశ్వంభర, జూబ్లీహిల్స్ : పారిశ్రామికవేత్తలు కేవలం పెట్టుబడిదారులు కాదు… రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో జరిగిన ‘ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ 4.0 అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ గ్యాప్‌ను తగ్గించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పాలసీ అమలు చేస్తున్నామని, పెండింగ్ సబ్సిడీలను దశలవారీగా చెల్లిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రవి కుమార్, కేకే మహేశ్వరీ, శ్రీనివాస్ గరిమెల్లా, భాస్కర్ రెడ్డి, అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.