గుర్తింపు పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లండి

  •   రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. షబరీష్  ఆదేశాల మేరకు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయంలో భద్రపరిచిన అన్‌క్లెయిమ్డ్ , అన్‌నోన్  ప్రాపర్టీ కింద ఉన్న వాహనాలను సంబంధిత యజమానులు తమ గుర్తింపు పత్రాలు, వాహన ధ్రువపత్రాలు సమర్పించి స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు తెలిపారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం అన్‌క్లెయిమ్డ్/అన్‌నోన్ ప్రాపర్టీ కింద మొత్తం 132 వాహనాలు భద్రపరచబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వాటిలో 108 మోటార్ సైకిళ్లు, 21 త్రీ వీలర్లు, 03 ఎంఎంవీలు  ఉన్నట్లు వెల్లడించారు. వాహన యజమానులు ఈ ప్రకటన విడుదలైన తేదీ నుండి 10 రోజులలోపు సంబంధిత పత్రాలు, గుర్తింపు ఆధారాలు సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఎవరూ క్లెయిమ్ చేయని వాహనాలను అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీగా పరిగణించి, జిల్లా నోడల్ కమిటీ ద్వారా వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. అందువల్ల సంబంధిత వాహన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వాహనాలను స్వాధీనం చేసుకోవాలని రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు కోరారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/show-identification-documents-and-pick-up-vehicles/article-16368

Tags: