దుర్గమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈగ మల్లేశం
విశ్వంభర, హనుమకొండ : వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలం దేవీలాల్ తండా గ్రామoలో నిర్వహించిన దుర్గమ్మ తల్లి పండుగ వేడుకల్లో కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ, గ్రామాలలో ఎంతో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన వేడుకలకు హాజరవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా దుర్గమ్మ తల్లి పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ఈ తరహా పండుగలు సమాజానికి ఐక్యతను పెంపొందిస్తాయని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్య, జాటోతు శ్రీనివాస్, బానోతు భాస్కర్, గంగాధర్ రావు, సురేందర్, సర్వర్, కరిమిల్ల సంపత్ రావు, భూషబోయిన సంపత్ యాదవ్, స్థానిక, మండల పట్టణ, ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.