సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం  

సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం  

  • సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం  

 విశ్వంభర, ఇనుగుర్తి: పరిణితి చెందిన సమాజ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైనదని తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో బండారు పార్థసారథి,ఎస్సై కరుణాకర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యువజన వారోత్సవాలు పురస్కరించుకొని మండల కేంద్రం ఇనుగుర్తిలో సోమవారం రెవెన్యూ,పంచాయతీరాజ్,పోలీసు, వైద్య ఆరోగ్య తదితర లైన్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో 2కే రన్ వారు జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు విద్యార్థులు వ్యాయామం,యోగ, క్రీడలలో ఆసక్తిని పెంపొందించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. నిరంతరం ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే మానసిక ఉల్లాసంతో పాటు జ్ఞాపకశక్తి పెరిగి ఏకాగ్రత అలవడుతుందన్నారు.డ్రగ్స్, మద్యపానం,గంజాయి వంటి మరకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. యువతతోనే  సమైక్యత పెంపొంది దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, వాలీబాల్ సీనియర్ కోచ్ సట్లభిక్షం,దార్ల భాస్కర్ గ్రామ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-role-of-youth-in-society-building-is-crucial/article-15425

Tags: