దివ్యాంగులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి : టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి: ఆత్మస్థైర్యం తో పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని టీజీఐఐసి చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.సంగారెడ్డి పట్టణంలోని సంజీవ్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష , ALMICO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలను , వీల్ చైర్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు సంగీతా మహేష్, యశోద , విద్యాశాఖ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.