“నేను సైతం” కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు
On
విశ్వంభర, మహబూబాబాద్: ఎస్పీ డా. శభరిష్ ఆదేశాల మేరకు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా స్థానిక 14వ వార్డు పరిధిలోని రామచంద్రపురం-2 నివాసం ఉండే కొణతం మధుసూదన్ రెడ్డి ముందుకు వచ్చి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని 5 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేరాలను అరికట్టడమే కాకుండా, నేరస్తులను త్వరగా గుర్తించడమనేది సీసీ కెమెరాల ద్వారా సాధ్యమవుతుందని వివరించారు. అదేవిధంగా కాలనీల్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మధుసూదన్ రెడ్డి ని టౌన్ సీఐ శాలువాతో సన్మానించారు.1.jpeg)



