సాంఘిక సంక్షేమ పాఠశాల  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ 

సాంఘిక సంక్షేమ పాఠశాల  కలెక్టర్ ఆకస్మిక తనిఖీ 

విశ్వంభర, మహబూబాబాద్: మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల)ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ అప్పర్ ప్రైమరీ,  హాస్పిటల్, హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం కల్పించే  డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనం, టిఫిన్స్, స్నాక్స్ సిద్ధం చేయాలని చెప్పారు. పిల్లలకు, వసతి గృహాలు పాఠశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆ  నివేదికలను సమర్పించాలని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపల్ ని  ఆదేశించారు. ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన వసతి గృహాలను క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్, భోజనం, డిన్నర్ సమయాలలో సందర్శించి వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థ వసతి గృహాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని అందుకు సంబంధిత శాఖ ప్రధాన అధికారి లేదా ప్రత్యేక అధికారి వద్దనే ఉండాలని, భోజనం, సౌకర్యం తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం  హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ ను సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు. హాస్పిటల్ పరిధిలోని సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందించడం కోసం డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండాలని, వేసవి ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ వార్డు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలని, గర్భిణీ స్త్రీలను, చిన్న పిల్లలను ఇతర వ్యాధిగ్రస్తులను గమనిస్తూ ఉండాలని, సూచించారు. కలెక్టర్ వెంట తొర్రూరు  రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిసిఓ జయశ్రీ, ప్రిన్సిపల్ రత్నమాల, హాస్పిటల్ డాక్టర్స్ సుగుణాకర్ రాజు, నందన దేవి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, తదితరులు ఉన్నారు.

Tags: