సైబర్ నేరాలపై  అవగాహన సదస్సు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామన్నపేట ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ ఐ నాగరాజు మాట్లాడుతూ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాధాన్యం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, చైన్ స్నాచింగ్ నివారణ చర్యలపై గ్రామస్తులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ చిన్నారుల రక్షణలో సమాజ బాధ్యతను గుర్తుచేశారు.బాల్య వివాహాల నివారణపై చట్టపరమైన అంశాలను వివరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నరసింహ,సురేష్,మధు, గ్రామస్తులు,యువత పాల్గొన్నారు.

Tags: