ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేour Title
విశ్వంభర, నారాయణగూడ : నారాయణగూడలోని నారాయణ స్కూల్ ఈకిడ్స్ అండ్ ఈచాంప్స్ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు విద్యా ప్రస్థానంలో తొలి మెట్టును పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ఏజీఎం బాల పరమేశ్వర్, కోఆర్డినేటర్లు నూర్, రాధిక, ఆజాద్, ఆర్ అండ్ డి హెడ్‌లు మనోహర్, మీనా, ప్రిన్సిపాల్ వేషఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల పరమేశ్వర్ మాట్లాడుతూ విద్యతో పాటు ఒక నైపుణ్యం నేర్చుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే వ్యక్తిత్వ వికాసం కూడా అవసరమని, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మంచి అలవాట్లు, విలువలు పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నూర్, రాధిక, ఆజాద్, మనోహర్, మీనా, వేషఖ తదితరులు పాల్గొన్నారు.



