మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
On
.విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య అనారోగ్య కారణంగా మరణించారు. వారి కుటుంబాన్ని మాజీ సర్పంచులు కోల సత్తయ్య గౌడ్, కొడిమాల యాదగిరి గౌడ్ లు పరామర్శించి వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ తరపున 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నరుకుడు బిందెల సైదులు, సెక్రెటరీ జనరల్ చుంచు శ్రీనివాస్, ఎల్ ఎస్ ఫౌండేషన్ చైర్మన్ లగ్గాల పురుషోత్తం గౌడ్, వార్డు సభ్యులు చిన్నం యాదగిరి, చుంచు నాగరాజు, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు వీరస్వామి గౌడ్,నాగుల ఏడుకొండల రావు,పాల సంఘం మాజీ చైర్మన్ చుంచు మల్లయ్య , ఎలిమినేటి గోపాల్, లగ్గాల నరహరి,ఎలిమినేటి నరేష్, కట్టేకోల యాదగిరి,బెజ్జరబోయిన ముఖేష్ ,తదితరులు పాల్గొన్నారు.



