గ్యాస్ గోదాముల వద్ద భారీ క్యూలు
On
విశ్వంభర, హైదరాబాదు : సిలిండర్ల కొరత ఉందన్న వదంతులతో నగరవ్యాప్తంగా గ్యాస్ గోదాముల వద్ద ప్రజలు భారీగా క్యూలలో నిలుస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ల కోసం ముందస్తుగా తీసుకునేందుకు తరలివస్తుండటంతో గోదాముల వద్ద రద్దీ పెరిగి అవ్యవస్థ నెలకొంటోంది. ప్రత్యేకంగా ఉదయం వేళల నుంచే మహిళలు, వృద్ధులు గోదాముల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన నియంత్రణ లేకపోవడంతో కొన్నిచోట్ల తోపులాటలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సిలిండర్ల సరఫరా తగినంతగా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వదంతులను నమ్మి గోదాముల వద్ద గుమిగూడవద్దని, సాధారణ సరఫరా కొనసాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాగ్‌లింగంపల్లి–ఆజాంబాద్ వీఎస్టీ సమీప గ్యాస్ గోదాముల వద్ద కూడా ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడిన దృశ్యాలు కనిపించాయి.



