లింకు రోడ్డుతో ట్రాఫిక్ సమస్యకు చెక్ : ఎమ్మెల్యే గాంధీ   

లింకు రోడ్డుతో ట్రాఫిక్ సమస్యకు చెక్ : ఎమ్మెల్యే గాంధీ   

విశ్వంభర, చందానగర్:  చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి లో బిహెచ్ఈఎల్  కల్వర్టు నుండి నాల మీదుగా శ్రీదేవి థియేటర్ రోడ్డు వరకు ప్రతిపాదిత లింక్ రోడ్డు పనులను ఎమ్మెల్యే గాంధీ  ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతాయని తెలిపారు. పనుల ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేసి, వేగంగా ప్రారంభించి, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్‌పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనాతో 2.7 కిలోమీటర్ల పొడవులో 4 లేన్ ప్రధాన రహదారి, 2 లేన్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా వేగంగా పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.రోడ్డు విస్తరణ వల్ల ట్రాఫిక్ తగ్గి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలుగుతుందని, కాలనీ వాసులకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలతో రోడ్డు అభివృద్ధి చేపడతామని అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అనేక రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేలా మరిన్ని లింక్ రోడ్లు, ప్రత్యామ్నాయ రహదారులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, డీఈ  శిరీష, నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు  స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags: