అంబేద్కర్ జయంతి సభ కు తరలి రావాలి
విశ్వంభర, మహబూబాబాద్ : డా. అంబేద్కర్ 135 వ జయంతి సభకు తరలి రావాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి దార్ల శివరాజ్ పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి గుగులోతు నరేష్ అధ్యక్షతన వహించారు . ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో జయంతి కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ, బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ జీ, మాయావతి , ఆదేశాల మేరకు దేశ వ్యాప్త సభల లో భాగంగా జోన్ స్థాయిలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కు సంబంధించిన బహిరంగ సభ ఛలో వరంగల్ బహుజన - ఓరుగల్లు పొరుగర్జన పేరుతో ఈ నెల 14వ తేదీ న సాయంత్రం 4 గం: నుండి హనుమకొండలో కాకతీయ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు .మూడు జోన్లలో, మూడు సభలు నిర్వహిస్తున్నట్లు, ఆయన తెలిపారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాo శేఖర్ వస్తున్నట్లు ఆయన తెలిపారు . ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బహుజనులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా మాజీ ఇంచార్జీ దార ప్రసాద్ రావు, ప్రతాప్, వెంకటేష్, శేష, సింహాద్రి, రవి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు .



