10 నుంచి డా.హిప్నో కమలాకర్ జయంతి వేడుకలు
On
విశ్వంభర, అశోకనగర్ : ఏప్రిల్ 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు డా.హిప్నో కమలాకర్ జయంతి వేడుకలను అమెరికా, లండన్‌తో పాటు ఒడిశా, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు అశోకనగర్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, తెలంగాణ సంఘ అధ్యక్షుడు సాగర్ల రఘు, జయశ్రీ మాట్లాడారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ విద్యార్థులకు స్కాలర్షిప్‌లు అందించడం, పాఠశాలలు, కాలేజీలు, హోంలు, హాస్టళ్లలో మానసిక సమస్యలు, మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.



