ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం

  • : పూజల హరికృష్ణ

విశ్వంభర, సిద్దిపేట:  గ్రామస్తులు ఐక్యంగా ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమని, జక్కాపూర్ కాంగ్రెస్‌కు కేరాఫ్ అడ్రసని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. గ్రామాల్లోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రైతుల మేలు కోసం ప్రభుత్వం శ్రమిస్తుందన్నారు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో గౌడ కుల సంఘం సభ్యులు మంగళవారం ఏర్పాటుచేసిన మర్యాదపూర్వక సమావేశానికి పూజల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు డీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్‌వీర్, కాంగ్రెస్ నాయకులు శాలువ కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎల్లమ్మగుడిలో మొక్కులు చెల్లించుకున్నారు. గౌడ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు. మోసర్ల ప్రియాంక-భూమిరెడ్డి పిలుపు మేరకు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. గోపులపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కూరటి రాజయ్య, చంద్రం ఆధ్వర్యంలో స్థానిక రైతులు, ప్రజలతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జక్కపూర్ గ్రామానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటానన్నారు. గౌడ కులస్తులకిచ్చిన మాట ప్రకారం రూ.10లక్షలతో సీసీ రోడ్డు వేయించామని, పెండిగ్‌లోని పంక్షన్ హాల్ అభివృద్ధికి సంబంధించిన పనులను కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలో దాదాపు 61ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యే హైదరాబాద్‌లో తిరుగుతుంటే తాను మాత్రం నిత్యం ప్రజా క్షేత్రంలోనే ఉండి, ప్రజల సమస్యలు వింటూ సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి గోపులపూర్ కాలువల విషయాన్ని తీసుకెళ్లి వీలైనంత త్వరగా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాని హామీనిచ్చారు. ఈ  కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎండీ కలిమోద్దీన్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ, సీనియర్ నాయకుడు బుచెల్లి రవి, ఎఏంసీ వైస్ ఛైర్మన్ వంశీ, ఎఏంసీ డైరెక్టర్ అశోక్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాట్ల రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బింగి యాదగిరి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కూరటి రాజయ్య, తీగల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: