సీఎంఆర్ఎఫ్ అనారోగ్య బాధితులకు వరం

సీఎంఆర్ఎఫ్ అనారోగ్య బాధితులకు వరం

విశ్వంభర, నెల్లికుదురు: ప్రభుత్వం అందజేసే సిఎంఆర్ఎఫ్ అనారోగ్య బాధితుల పాలిట గొప్ప వరమని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆకుతోట సతీష్,వార్డు సభ్యులు చీకటి జగదీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు మండలంలోని రామన్నగూడెం లో భూతం మంజులకు రూ.20 వేలు, రావుల రాజు 25 వేలలు, మల్యాల సయిదమ్మ 25 వేలు,ఎడ్ల రామస్వామి 52 వేలు, మల్లికంటి జయమ్మకు  రూ.21,500లు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల సతీష్, కొరిశెట్టి వెంకన్న, ఆకుతోట ప్రభాకర్, పాశం కొంరయ్య, కనకం మల్లయ్య, మల్యాల శ్రీనివాస్, పాశం వెంకన్న, వల్లపు రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags: