యూపీఎస్సీ అభ్యర్థుల్లో  స్ఫూర్తి నింపిన లక్ష్మీ రచన

యూపీఎస్సీ అభ్యర్థుల్లో  స్ఫూర్తి నింపిన లక్ష్మీ రచన

విశ్వంభర, హైదరాబాదు: విజన్ ఐఏఎస్ హైదరాబాదులో నిర్వహించిన సెమినార్‌లో యూపీఎస్సీ 2025లో ఆల్ ఇండియా  178 ర్యాంక్ సా ధించిన లక్ష్మీ రచన  పాల్గొని అభ్యర్థులకు స్ఫూర్తినిచ్చారు. ప్రిపరేషన్ విధానం, పట్టుదల, మానసిక దృఢత్వం విజయానికి కీలకమని వివరించారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించిన లక్ష్మీ రచన, ఐఐటి ఇండోర్‌లో చదివి, ఆర్ అండ్ డి రంగంలో పనిచేసిన అనంతరం సివిల్స్‌లో విజయం సాధించారు. 2023లో స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయినా, 2025లో పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణ సింగ్ అధ్యక్షత వహించగా, విజన్ ఐఏఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: