గ్రామ సర్పంచ్ కు సన్మానం

గ్రామ సర్పంచ్ కు సన్మానం

విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండలం వాయిల సింగవరం గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులును జీవనోపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళిన వాయిలసింగవరం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్ గా గ్రామానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.  అలాంటి వ్యక్తి నేడు గ్రామానికి సర్పంచ్ గా ఎన్నిక కావడం హర్షనీయమని, యువకుడు విద్యావంతుడు అయిన గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు నేతృత్వంలో గ్రామం మరింత అభివృద్ది పథంలో పురోగమిస్తున్నదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుంగం రాము, శీలం సైదులు, గ్రామపెద్దలు కొల్లు సుబ్బారావు, దాములూరి మురళి, బుర్రా సైదులు, నంద్యాల వెంకటేశ్వర్లు, తుంగం పెద వెంకటేశ్వర్లు, మహలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Tags: