శ్రీ చైతన్య పాఠశాలల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

శ్రీ చైతన్య పాఠశాలల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

విశ్వంభర, బోడుప్పల్: శ్రీ చైతన్య ప్రైమ్ స్కూల్, శ్రీ చైతన్య ఒలింపియాడ్ పాఠశాలలో సంయుక్తంగా ఎస్.కె.జి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంగళవారం ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ అభిషేక్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శోభారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ఎస్.కె.జి చిన్నారి విద్యార్థులు ప్రాథమిక విద్యలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి చదువులో భాగమైన  ఈ కీలక మైలురాయిని  విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు. పునాది స్థాయి విద్యను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా ఎస్.కె.జి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు  రంగురంగుల వస్త్రాలు ధరించి చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.చిన్నారులు తమ ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని మరియు సృజనాత్మకతను చాటుతూ చేసిన ఈ ప్రదర్శనలు వేడుకకు మరింత శోభను చేకూర్చాయి. విద్యార్థుల ప్రగతికి నిరంతరం సహకరిస్తున్న ఉపాధ్యాయులను,పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు అభినందించారు.తల్లిదండ్రులు  ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రాడ్యుయేషన్ డే ను విజయవంతం చేశారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మధుర జ్ఞాపకాలను మిగిల్చిన ఈ వేడుక ఎంతో ఉల్లాసంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: