యువత ఉపాధి సృష్టించే దిశగా ముందుకు సాగాలి : హరీష్ రావు

యువత ఉపాధి సృష్టించే దిశగా ముందుకు సాగాలి : హరీష్ రావు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: యువత స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కళాశాల దారి లో ఏర్పాటు చేసిన సెరీన్ కేఫ్ ప్రారంభోత్సవంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,   యువత వ్యాపార రంగంలో ముందుకు వచ్చి ఉపాధి అవకాశాలను విస్తరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, మాజీ కార్పొరేటర్ రవి చారి, కేఫ్ నిర్వాహకులు దాసరి రవి ప్రసాద్, ప్రసన్న జెస్సీ, నాయకులు ఆర్ వివేక్, వెంకటకృష్ణ (బబ్లు) , రాజు తదితరులు పాల్గొన్నారు

Tags: