మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి: ఎంఎల్సీ తక్కెళ్లపల్లి
విశ్వంభర, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆయన మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్ సందర్శన అనంతరం ఎంఎల్సీ రవీందర్ రావు జిల్లా కలెక్టర్‌ను కలిసి రైతుల గోసను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, మద్దతు ధర లభించేలా చూసి అన్నదాతలను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న , బానోత్ రవి , సీనియర్ టిఆర్ఎస్ లీడర్, జేరిపోతుల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు



