ఆరోగ్య సిబ్బంది ర్యాలీ 

ఆరోగ్య సిబ్బంది ర్యాలీ 

విశ్వంభర, త్రిపురారం : ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో  డాక్టర్ వనిత, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఏఎన్ఎంలు , ఆశలు  పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని  విద్యార్థులు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు చేసుకోవచ్చునని త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చింతపల్లి వనిత అన్నారు. మంగళవారం మండలంలోని కంప సాగర్ కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు ఆరోగ్య సూత్రాలను వివరించారు. పిల్లలకు ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు సూచనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి, సూపర్వైజర్ కమలమ్మ, సి హెచ్ ఓ మాతంగి వెంకటయ్య, ఏఎన్ఎం లీలలతో పాటు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: