ఆంధ్రజ్యోతి ఆఫీస్ పై దాడి దుర్మార్గం
On
విశ్వంభర, అనంతపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నేతలు చేసిన దాడిని హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి రద్ధం ముత్యాలప్ప ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసిపి బడా నేతలు దాడి చేయడం దుర్మార్గపు చర్య అని అధికారాన్ని కోల్పోయి వైసీపీ నాయకులకు మతిభ్రమిస్తుందని గత వైసిపి ప్రభుత్వంలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో సిద్ధం సభలో ఏబీఎన్ విలేకరిపై దాడి చేయడం కూడా జరిగిందని ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సిగ్గుగా ఉందని ఆయన అన్నారు.



