బీసీ మహిళలకు ఉప కోటా  కల్పించాలి 

బీసీ మహిళలకు ఉప కోటా  కల్పించాలి 

 విశ్వంభర, జిహెచ్ఎంసి : బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ సంచార జాతుల(ఎంబీసీ)సంక్షేమ సంఘం అధ్యక్షుడు కాటపల్లి వీరస్వామి, శామల మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు న్యాయం జరిగేలా ప్రత్యేకంగా ఉప-కోటా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. బీసీ మహిళలు సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారని, వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఉప-కోటా తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మహిళా నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ మహిళల హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Tags: