రూ.1.2 కోట్లతో  అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.1.2 కోట్లతో  అభివృద్ధి పనులకు శ్రీకారం

విశ్వంభర, అంబర్ పేట : ప్రాంత అభివృద్ధికి, మౌలిక వసతుల మెరుగుదలపై , ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తు, ప్రతి కాలనీలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనులు కొనసాగుతాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అంబర్‌పేట నియోజక వర్గం బాగ్ అంబర్‌పేట్ డివిజన్ నందనవనం కాలనీలో మంగళవారం నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఆయన, మాజీ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు శాంతినగర్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు కొనసాగనున్నాయి. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కాలనీలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, స్థానికులకు ఉపశమనం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిహెచ్. చంద్రమోహన్, పార్టీ నాయకులు శ్రీరాములు, శ్రీనివాస్, రమేష్ , కాలనీవాసులు , అధికారులు పాల్గొన్నారు.

Tags: