శాంతి భద్రతల నియంత్రణలో సీఎం విఫలం
విశ్వంభర, హైదరాబాదు : హోం శాఖ బాధ్యతలు తన దగ్గరే ఉంచుకుని కూడా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను సమర్థంగా నియంత్రించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు విమర్శించారు. హైదరాబాదు హిమాయత్ నగర్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె నగరంలో విస్తరిస్తున్న డ్రగ్ రాకెట్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ మాఫియాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని ఆరోపించారు. డ్రగ్ మాఫియాను అరికట్ట డంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్ రాకెట్ నిర్మూలనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, యువతను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, సీనియర్ నాయకుడు మామిడి శెట్టి శివాజీ తదితరులు పాల్గొన్నారు.



