నిరాశ్రయుల కోసం వైద్య శిబిరం
On
విశ్వంభర, నాంపల్లి : వీధుల్లో నివసించే వారు ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని, మెరుగైన జీవనానికి ఆరోగ్యమే పునాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన వైద్య, ప్రాథమిక అవసరాల శిబిరంలో ఆయన మాట్లాడారు. అమన్ వేదిక, నిరాశ్రయ శ్రామిక సంఘటన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ శిబిరంలో నాంపల్లి పరిసర ప్రాంతాల నుంచి 113 మంది నిరాశ్రయులు వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన సేవలు పొందారు. వారికి దుస్తులు, ప్రాథమిక అవసరాల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ, నిరాశ్రయులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.



