తొర్రూరులో  చలివేంద్రం ఏర్పాటు 

తొర్రూరులో  చలివేంద్రం ఏర్పాటు 

విశ్వంభర, తొర్రూరు: బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభమాజీ ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీశంకర్ అన్నారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ముందు శ్రీ వాసవి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ అధ్యక్షులు చలువాది సత్యనారాయణ మాట్లాడుతూ,  దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రంలో త్రాగునీరు తో పాటు చల్లని మజ్జిగను కూడా ఏర్పాటు చేశామని , దాతలు తమకు ఏదైనా ప్రత్యేక రోజును తెలియజేసి రూ .1016 లు ఇస్తే ఆ రోజు వారి పేర్లు బోర్డుపై ప్రదర్శించడం జరుగుతుందని, ఈ వైశాఖమాసంలో త్రాగునీరు మజ్జిగ వితరణ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు , బోనగిరి శంకర్ ,నాల్ల కృష్ణమూర్తి, దారం కుమారస్వామి, వాసవి క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు,  పాల్గొన్నారు.

Tags: