బస్సు సర్వీసును పునః ప్రారంభించాలి
On
విశ్వంభర, చౌటుప్పల్: గత కొన్ని సంవత్సరాల నుండి పంతంగి గ్రామానికి దిల్సుఖ్ నగర్ నుండి 555 నంబరు బస్సు సర్వీసును కొనసాగిస్తున్నారు. ఈ బస్సు వలన గ్రామంలో ఉన్న ప్రజలు ఉపాధి ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వివిధ గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నత విద్యసభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రైతులకు. వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉండేది. ఆకారణంగా ఈ బస్సును నిలిపివేయటం వల్ల గ్రామ ప్రజలు తవఇబ్బందులు ఎదుర్కోకొంటున్నారు. ప్రజల సౌకార్యార్థం బస్సును పునః ప్రారంభించాలని ఉప సర్పంచ్ సదానందం , వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి గుండెపురం ప్రతిభ నరేష్ గాడిదల శ్వేత ప్రవీణ్ బండ శేఖర్ బొమ్మని రాజశేఖర్ బాతరాజు వెంకటేష్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.



