ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడిగా గోపాల్ మిశ్రా
On
విశ్వంభర, న్యూఢిల్లీ : ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) జాతీయ అధ్యక్షుడిగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు గోపాల్ మిశ్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా, నూతన అధ్యక్షుడిగా గోపాల్ మిశ్రా ప్రకటించారు. గత అధ్యక్షుడు డాక్టర్ కే. విక్రమరావు మరణంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మిశ్రా మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రస్తుతం ఆర్థిక సమస్యలు, ఏఐ ప్రభావంతో సవాళ్లు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి ఉపాధి రక్షణ, వేతన భద్రత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉపేంద్ర సింగ్ రాథోడ్, రజత్ మిశ్రా, పి. ఆనందం, కె. విశ్వదేవరావు, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



