ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విశ్వంబర, త్రిపురారం : త్రిపురారం మండల కేంద్రంలో  మంగళవారం రోజున  మండల కేంద్రంలోనూ , పలు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం జరిగింది. త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జిల్లా సహకార అధికారి పత్య నాయక్, మరియు త్రిపురం గ్రామ సర్పంచ్ బైరం లక్ష్మీ కృష్ణ ప్రారంభించారు. అలాగే  మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఐకెపి కేంద్రాన్నినిడనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ అంకత సత్యం ప్రారంభించడం జరిగింది. అనంతరం.. వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17 శాతం తేమతో అమ్ముకోవచ్చని తెలియజేశారు.  దళారులను మధ్యవర్తుల చేతుల్లో మోసపోకుండా   ప్రభుత్వానికి తమ పంటను అమ్ముకోవడం ద్వారా దాన్యము పైసలు నేరుగా ఎకౌంటు లోకి జమవుతాయని తెలిపారు. అరే అలాగే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఏ గ్రేడ్ దాన్ని క్వింటాలకు  2389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి గాను  2369 రూపాయలు ధర చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్ముకోవచ్చని తెలిపారు.
 మాటూరు గ్రామంలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచ్ వెంకట్రాం నాయక్  మరియు మండల నాయకులు, ప్రారంభించగా  డొంకతండ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచులు బిచ్చు నాయక్ రఘునాయక్ ప్రారంభించడం జరిగింది. ఐకెపి కేంద్రాల ప్రారంభోత్సవంలో పలువురు రైతులు,నాయకులు, మండల నాయకులు, మహిళా సమైక్య సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: