మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు

మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు

విశ్వంభర, మిర్యాలగూడ:  మిర్యాలగూడ లో  రైతులకు, మిల్లర్లకు మధ్య సోమవారం రాత్రి జరిగిన వాగ్వాదం నేపథ్యంలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు అధికారుల జోక్యంతో మళ్లీ మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజ్ మిల్లర్లతో జరిపిన అత్యవసర చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల నిలిపివేతతో రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్,శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్)   డీఎస్పీ రాజశేఖర్ రాజు  సంయుక్తంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మిల్లుల వద్ద నిలిచిపోయిన ధాన్యం ట్రాక్టర్లను వెంటనే ఖాళీ చేయించి,కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారుల బృందం మిల్లర్లను ఆదేశించింది. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చూడాలని, ధరల విషయంలో రైతులకు నష్టం కలగకూడదని ఎమ్మెల్యే బి ఎల్ ఆర్  స్పష్టం చేశారు. అన్నదాతలతో మిల్లర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని అధికారులు సూచించారు. అధికారుల ఆదేశాలకు మిల్లర్లు సానుకూలంగా స్పందించి,తక్షణమే కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో హైవేపై ధర్నా చేస్తున్న రైతులు తమ నిరసనను విరమించి మిల్లుల వద్దకు చేరుకున్నారు.  వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లు వేగవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.WhatsApp Image 2026-04-07 at 7.42.20 PM (2)

Tags: